News March 21, 2025

IPL అభిమానులకు గుడ్ న్యూస్

image

IPL ప్రేమికులకు BCCI శుభవార్త చెప్పింది. దేశంలోని 50 నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. స్టేడియంను తలపించేలా లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్, మ్యూజిక్, ఫుడ్ కోర్ట్స్, ఎంటర్టైన్‌మెంట్, కిడ్స్ ప్లే జోన్, ప్లే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో నిజామాబాద్ (APR 5,6 తేదీల్లో), విజయవాడ (MAY 10,11), వరంగల్ (MAY 17, 18), కాకినాడ (MAY 23, 25)లో ఏర్పాటు కానున్నాయి.

Similar News

News July 7, 2025

అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం

image

AP: అమరావతి <<16882676>>క్వాంటమ్ వ్యాలీ<<>> డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్‌ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించింది.

News July 7, 2025

కాసేపట్లో ఐసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌పై హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.

News July 7, 2025

ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

image

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్‌పూర్‌లోని హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడి 8 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.