News March 21, 2025

సేవా పతకాలకు చిత్తూరు పోలీసులు ఎంపిక

image

ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు పోలీసులకు పతకాలు వచ్చాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. డీఎస్పీ మహబూబ్ బాషా, మనోహర్, మునిరత్నం, దేవరాజుల నాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, నాంతుల్లా, బాలాజీ, హరిబాబు, మణిగండన్‌కు పథకాలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

Similar News

News February 28, 2026

చిత్తూరు జిల్లాకు రూ.101.30 కోట్ల కేటాయింపు

image

చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇవాళ పింఛన్ పొందలేని వారికి సోమవారం ఇవ్వనున్నారు.

News February 28, 2026

చిత్తూరు పోలీసులకు అవార్డులు

image

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికిగాను అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిత్తూరు అడ్మిన్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ ఎస్ఐ రవి, చిత్తూరు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పలమనేరు అర్బన్ హెడ్ కానిస్టేబుల్ లీలాసుఖ నాయుడు, చిత్తూరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజులు, రాళ్లబూదుగూరు హెడ్ కానిస్టేబుల్ పరమేష్ తదితరులు ఉన్నారు.

News February 27, 2026

CTR: రూ.కోట్లు కొల్లగొట్టి.. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి!

image

చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మొన్న పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.