News March 21, 2025

NRPT: రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్ 

image

ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అర్హత ఉన్న వారిని ఓటరు జాబితాలో చేర్పించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని చెప్పారు.

Similar News

News March 31, 2025

అల్లవరం: బ్రిడ్జి పైనుంచి దూకేసిన వ్యక్తి గల్లంతు

image

అల్లవరం మండలం బోడసకుర్రు- పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి ఓ కారులో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేశాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీంతో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2025

MBNR: సర్వం సిద్ధం.. నేడే రంజాన్ పండుగ

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో నేడు ముస్లింలు రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) నిర్వహించుకోనున్నారు. ఇప్పటికే ఈద్గాలు, మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా దీక్షలు చేస్తున్న ముస్లింలు నెల వంక కనిపించటంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ చాంద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

News March 31, 2025

VJA: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!