News March 21, 2025
కాసేపట్లో చెన్నైకి సీఎం రేవంత్ ప్రయాణం

TG: CM రేవంత్ కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకి ప్రయాణం కానున్నారు. డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు CM స్టాలిన్ అధ్యక్షతన రేపు అక్కడ జరిగే బీజేపీయేతర దక్షిణాది నేతల భేటీలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ ఇద్దరు నేతలూ ఒకే స్టాండ్ తీసుకుంటారా లేక విభేదిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 23, 2026
కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్‌లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.
News January 23, 2026
MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 23, 2026
బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.


