News March 21, 2025
విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు: మంత్రి

విశాఖ ప్రజాప్రతినిధులతో పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. వీఎంఆర్డీఏ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
Similar News
News March 22, 2025
త్వరలో తెలంగాణ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన: జితేందర్ రెడ్డి

ఢిల్లీలో నిర్మించనున్న నూతన తెలంగాణ భవన్ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండబోతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి అన్నారు. అధికారులతో కలిసి ఆయన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ భవన్‌కు సంబంధించిన డిజైన్‌కు సీఎం అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి నాలుగేళ్లలో పూర్తి చేస్తామని జితేందర్ రెడ్డి తెలిపారు.
News March 22, 2025
ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్స్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ

క్రికెట్ బెట్టింగుల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రికెట్ బెట్టింగుల నిర్వాహకులు, పందెపు రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. యువత బెట్టింగుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.
News March 22, 2025
జిల్లాలో రక్తహీనత తగ్గింది: కేంద్ర బృందం

రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పలు పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తున్న కారణంగానే జిల్లాలో రక్తహీనత తగ్గిందని జిల్లాలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం అభిప్రాయపడింది. కలెక్టర్ అంబేడ్కర్‌ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత గుర్తించిన అంశాలను కలెక్టర్‌కు వివరించారు.