News March 21, 2025
కన్నెపల్లి: మామ, బావమరిది కలిసి చంపేశారు

కన్నెపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చదువుల లక్ష్మణ్‌ను అతడి మామ పార్వతి రాజేశం, బావమరిది అనిల్ తీవ్రంగా కొట్టి చంపేశారు. ఎస్ఐ గంగారాం వివరాల ప్రకారం.. లక్ష్మణ్ తన భార్య రోజాతో రోజు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తన కూతురితో ఎందుకు గొడవ పడుతున్నావని శుక్రవారం రాజేశం, అనిల్ కలిసి లక్ష్మణ్ పై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 14, 2025
జిల్లాలో 74,349 MTల ధాన్యం సేకరణ

సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 11,905 మంది రైతుల నుంచి 74,349 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గురువారం ఒక్కరోజే 5142 MTల ధాన్యంను కొనుగోలు చేశారు. మొత్తం ధాన్యంలో 2528 MTల సన్న రకం, 71,820 MTల దొడ్డు రకం ధాన్యం ఉన్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.177.62 కోట్లు కాగా, ఇందులో రూ.69.76 కోట్లు చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి.
News November 14, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ హాల్‌కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ సెంటర్లో ఉన్నారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరో రెండు గంటల్లోపు గెలుపు ఎవరిది? అనేది ఓ క్లారిటీ రానుందని టాక్.
News November 14, 2025
పర్యావరణం కోసం ఈ వారియర్ మామ్స్

దిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు వాయుకాలుష్య తీవ్రత పెరిగిపోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి బవ్రీన్ వారియర్ మామ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాయుకాలుష్యం చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తుల్లోని పోషక విలువలను నాశనం చేస్తుందంటున్న బవ్రీన్ ఎన్నో ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారియర్ మామ్స్‌లో ప్రస్తుతం 1400లకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు.


