News March 24, 2024

అనకాపల్లి ఎంపీ అభ్యర్థి రాజకీయ ప్రస్థానం

image

అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ 1985లో టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా, 1989 ఎన్నికలలో కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌గా ప‌ని చేశాడు. 2012లో రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయి, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యాడు. 2018లో రెండోసారి TDP తరఫున రాజ్యసభకు ఎంపికై ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

Similar News

News February 20, 2026

ఏయూ గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

image

ఆంధ్రా యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం పాడడం తప్పా.. భారతమాతకు జై అనడం తప్పా.. అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. వీసీకి ఫిర్యాదు చేయాలే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేయడం తగదన్నారు. వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు.

News February 20, 2026

విశాఖలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 85 కేంద్రాల్లో 81,001 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు తాగునీరు, వైద్య శిబిరాలు, అదనపు బస్సుల సౌకర్యం కల్పించాలని ఆమె సూచించారు. పొరపాట్లు జరగకుండా పరీక్షలను విజయవంతం చేయాలని జేసీ స్పష్టం చేశారు.

News February 20, 2026

గ్లోబల్ ఏఐ సెంటర్‌గా వైజాగ్: గూగుల్ సీఈవో

image

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విశాఖతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థిగా చెన్నై నుంచి ఐఐటీ-ఖరగ్‌పూర్ వెళ్లేటప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ మీదుగా ప్రయాణించేవాడినని, అప్పట్లో అది ఎంతో ప్రశాంతమైన నగరమని గుర్తుచేసుకున్నారు. అలాంటి విశాఖ నేడు గ్లోబల్ ఏఐ (AI) హబ్‌గా మారుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. ఈ మార్పు అద్భుతమని ఆయన కొనియాడారు.