News March 21, 2025

భూపాలపల్లి జిల్లాలో 3,441 మంది విద్యార్థులు హాజరు

image

భూపాలపల్లి జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలియజేశారు. 3,449 విద్యార్థులకు 3,441 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News January 7, 2026

12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

image

AP: శ్రీశైలంలో ఈ నెల 12-18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 12న 9.15amకు స్వామివారి యాగశాల ప్రవేశం, బ్రహ్మోత్సవ సంకల్ప పఠనం ఉంటుంది. 13 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న సంక్రాంతి వేళ బ్రహ్మోత్సవ కళ్యాణం జరిపిస్తారు. 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 12-18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలు నిలిచిపోనున్నాయి.

News January 7, 2026

సంగారెడ్డి: సంక్రాంతికి ప్రత్యేక 503 ఆర్టీసీ బస్సులు

image

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సర్వీసులతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 503 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు.

News January 7, 2026

వివాహ ఆటంకాలను తొలగించే సర్ప దోష నివారణ

image

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.