News March 24, 2024
HYD: కడుపు కోసి.. దారుణంగా చంపాడు..!

HYD బాలానగర్‌లో <<12918850>>యువకుడు ప్రణీత్ తేజ<<>> (20)ను స్నేహితుడే చంపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మద్యం తాగుదామని తీసుకెళ్లిన స్నేహితుడు.. ప్రణీత్ మత్తులోకి జారుకున్నాక మెడ, కడుపు కోసి చంపేశాడు. అనంతరం సైకో లాగా కడుపులోని పేగులను బయటకు తీశాడు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News January 16, 2026
ALERT: HYD వచ్చే NH-65పై ట్రాఫిక్ డైవర్షన్స్

పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో సొంతూరెళ్లిన నగరవాసులకు ట్రాఫిక్ అలర్జ్
☛ గుంటూరు→ మిర్యాలగూడ→ హాలియా→ కొండమల్లేపల్లి→ చింతపల్లి- మాల్ మీదుగా HYD
☛ మాచర్ల→ నాగార్జునసాగర్→ పెద్దవూర→ కొండపల్లేపల్లి- చింతపల్లి- మాల్ మీదుగా HYD
☛ నల్లగొండ- మార్రిగూడ బై పాస్- మునుగోడు→ చౌటుప్పల్ (NH-65)మీదుగా HYD
☛ కోదాడ- హుజూర్‌నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా HYD రావాలి.
News January 16, 2026
HYD: నైట్ ఫ్లైఓవర్లు బంద్!

‘షబ్-ఏ-మేరాజ్’ సందర్భంగా HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వాహనదారుల భద్రత కోసం ఈ రోజు రా.10 గం. నుంచి రేపు ఉదయం వరకు గ్రీన్‌ల్యాండ్స్, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్‌హౌస్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, నెక్లెస్ రోడ్ మూసేస్తున్నట్లు జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు. షేక్‌పేట్, బహదూర్‌పురా ఫ్లైఓవర్లను అవసరాన్ని బట్టి ఓపెన్ చేస్తారు. అత్యవసరమైతే 9010203626 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
News January 16, 2026
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.


