News March 21, 2025
నందనవనంగా అమరావతిని మార్చుకుందాం

AP రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. దాదాపు 30 వేల ఎకరాల్లో భారీ ప్రాజెక్టుల సమాహారం ఇది. అయితే మహానగరంగా ఎదిగే ఏ ప్రాంతమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పర్యావరణం. అందుకు ప్రభుత్వమే కాదు మనమూ నైతిక బాధ్యత వహించాలి. ప్రకృతితో స్నేహం చేస్తూ ఇంటికో చెట్టు పెంచాలి. ప్రకృతి ఒడిలో ఓలలాడేలా, పచ్చదనం విరబూసే నందనవనంలా అమరావతిని అలంకరించాలి. మీరేమంటారు.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
Similar News
News December 30, 2025
2026లో భారత్-పాక్ యుద్ధం.. US CFR జోస్యం

వచ్చే ఏడాదిలో భారత్-పాక్ మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉందని USకు చెందిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) హెచ్చరించింది. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్ ఈ ఉద్రిక్తతలకు నేపథ్యమని తెలిపింది. ఇరు దేశాలు ఆయుధాల సమీకరణ వేగవంతం చేయడం ఆందోళన కలిగిస్తోందని వివరించింది.
News December 30, 2025
3 పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ నితికా పంత్

ఆసిఫాబాద్ జిల్లాలోని పోలీసు స్టేషన్ల పనితీరును మెరుగుపరిచేందుకు SP నితికా పంత్ తనిఖీలను వేగవంతం చేశారు. ఇస్గాం,పెంచికల్‌పేట్,దాహేగాం ఠాణాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా స్టేషన్‌లోని వివిధ విభాగాలు, నేరాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, జనరల్ డైరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. DSP వహీదుద్దీన్ ఉన్నారు.
News December 30, 2025
మారనున్న తూర్పుగోదావరి రూపురేఖలు

కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఈ మూడు మండలాల ప్రజలు రాజమండ్రి ఆర్డీవో పరిధిలో సేవలు పొందనున్నారు. గత కొంతకాలంగా ఉన్న డిమాండ్ నెరవేరడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


