News March 21, 2025

నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: మేయర్

image

నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఖిలావరంగల్ మండలంలోని ఉర్సు, కరీమాబాద్ వాటర్ ట్యాంకర్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నీటి సరఫరాలో జాప్యంగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చొరవ తీసుకోవాలని తెలిపారు. వాటర్ ట్యాంక్‌లో నీటి సరఫరా నిలిచిపోయిందని తన దృష్టికి రావడంతో ఇక్కడికి వచ్చానని అన్నారు.

Similar News

News November 5, 2025

సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నిరుద్యోగ గ్రామీణ యువతకు టూవీలర్ మెకానిక్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(RSETI) డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండి వయస్సు 19- 40 మధ్య ఉండాలి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 5, 2025

BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<>EL<<>>)లో 47 కాంట్రాక్ట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి కొన్ని గంటలే ఛాన్స్ ఉంది. BE, బీటెక్, BSc(ఇంజినీరింగ్), ME, ఎంటెక్, MCA ఉత్తీర్ణులైనవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.150. SC, ST, PWBDలకు ఫీజు లేదు. నెలకు రూ.30వేల జీతం చెల్లిస్తారు.

News November 5, 2025

’14 వరకు పశువులకు టీకా కార్యక్రమం పూర్తి చేయాలి’

image

సూర్యాపేట జిల్లాలో ఉన్న 2.69 లక్షల పశువులకు ఈనెల 14వ తేదీలోపు టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పశువైద్య శాఖ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ కే. అనిల్ కుమార్ ఆదేశించారు. బుధవారం కోదాడ ప్రభుత్వ ప్రాంతీయ పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కోదాడలో ఇప్పటికే 3,300 పశువులకు టీకాలు వేయడం అభినందనీయమన్నారు.