News March 24, 2024
గుంటూరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అప్పులు తీర్చినా మరింత చెల్లించాలంటూ, రుణదాతలు వేధిస్తున్నారని కొత్తపేటలోని మెడికల్ ల్యాబ్‌లో పనిచేసే కూరాకుల శివప్రసాద్(38) అనే వ్యక్తి వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో చూసిన మిత్రులు అక్కడికి చేరుకుని అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 24, 2026
గుంటూరు ఛానల్ వంతెన నిర్మాణానికి నిధులు

గుంటూరు ఛానల్‌పై వంతెన పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఛానల్‌లోని 33.300 కి.మీ వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మించనున్నారు. దీని కోసం రూ.94.88 లక్షలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ ఈ మేరకు జీవో-92 విడుదల చేసింది. తగిన సాంకేతిక అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
News February 23, 2026
గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
News February 23, 2026
గుంటూరు జిల్లాలో ఇంటర్ పరీక్షల సందడి

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరవుతుండగా, వారి కోసం అధికారులు 87 పరీక్షా కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అధికారులు అన్ని కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.


