News March 21, 2025
తిరుపతి: ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదు

తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఒంటిపూట బడులు నిర్వహించడం లేదని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు డీఈవో కేవీఎన్ కుమార్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఒంటిపూట బడులు పెట్టని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్, ప్రేమ్ కుమార్, లోకేశ్, యుగంధర్, ముని, సుకుమార్ పాల్గొన్నారు.
Similar News
News March 1, 2026
TTD ఛైర్మన్ పదవి ఎవడబ్బ సొత్తు కాదు: BRనాయుడు

TTD ఛైర్మన్ పదవి ఎవడబ్బ సొత్తు కాదని, CM చంద్రబాబు చెబితేనే తాను పదవికి రిజైన్ చేస్తానని <<19270118>>BRనాయుడు<<>> అన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ రోజు నుంచే రాజీనామా చేయమని అడుగుతున్నారన్నారు. దీనిపై ఎందుకా అని ఆలోచిస్తే YCP చేసిన ఎన్నో అక్రమాలు బయటికి వస్తున్నాయన్నారు. తాను ఎక్కడా తగ్గేదేలే అన్నారు. వీడియోలో ఉన్న మహిళ కుటుంబానికి, తమ కుటుంబానికి 30 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
News March 1, 2026
తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులను పెంచింది. కువైట్‌లోని US నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ మిస్సైళ్లు, 12 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీంతో ఆ షిప్ పూర్తిగా దెబ్బతిందని, భారీగా అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు UAEలోని అమెరికా MSP క్లాస్ షిప్‌పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం.
News March 1, 2026
రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.


