News March 21, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, ఛైర్మన్

కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాణి దర్గాలో పీఠాధిపతి ఖుస్రు పాషా ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Similar News
News January 11, 2026
సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు

TG: ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన’ అంటూ CM రేవంత్, ప్రభుత్వంపై ఫైరయ్యారు.
News January 11, 2026
రూ.547 కోట్ల సైబర్ మోసం.. 17 మంది అరెస్టు

కాల్ సెంటర్లు, ఏపీకే ఫైళ్లు, ఓటీపీల ద్వారా అమాయకులను బురిడీ కొట్టించి రూ.547 కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో సీపీ సునీల్ దత్ వివరాలు వెల్లడిస్తూ.. ఈ ముఠా విదేశీ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి మోసాలకు పాల్పడిందని తెలిపారు. నిందితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, వారి ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 11, 2026
రాజమార్గం కానున్న.. HYD నుంచి ORR కారిడార్.!

HYD నుంచి ORR చేరుకోవాలంటే సిటీ ట్రాఫిక్ కష్టాల్లో గంటల సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇక త్వరలో ఈ తిప్పలు తీరనుంది. HYD పారడైజ్ జంక్షన్ నుంచి ORR శామీర్‌పేట జంక్షన్ వరకు 18 KM కారిడార్ నిర్మాణం జరగనుంది. ఇందులో 11.5KM ఎలివేటెడ్, 6KM ఎట్ గ్రేడ్, 0.5KM అండర్ గ్రౌండ్ కారిడార్ నిర్మిస్తారు. ఈప్రాజెక్ట్ పూర్తయితే ఇక ORR వెళ్లేందుకు రాజమార్గం కానుందని ఓ అధికారి తెలిపారు.


