News March 21, 2025
ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్

జవహర్‌నగర్ పరిధిలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (ACDS) బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ విద్యార్థుల కోసం 19వ స్నాతకోత్సవ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ప్రిన్సిపల్ డా.మమతా కౌశిక్ కళాశాల నివేదికను సమర్పించారు. ACDS ఛైర్మన్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గ్రాడ్యుయేట్లు ఆదర్శవంతంగా పనిచేయాలన్నారు.
Similar News
News July 5, 2025
న్యూడ్ వీడియోలతో బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్: సీపీ

విశాఖలో అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి న్యూడ్ వీడియో కాల్ చేయించుకొని రికార్డ్ చేశాడు. ఈ వీడియోలు ఆమె తల్లికి పంపి డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధిత మహిళ సీపీ శంఖబ్రత బాగ్చీని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేసి బెదిరిస్తున్న వ్యక్తి కర్నూల్ జిల్లా వాసిగా గుర్తించారు. అతడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
News July 5, 2025
NZB: వరల్డ్ పోలీస్ గేమ్స్‌లో బాబాకు మరో బ్రాంజ్ మెడల్

వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ బాబా మరో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అమెరికాలోని అలబామాలో జరుగుతున్న వరల్డ్ పోలీస్ ఆండ్ ఫైర్ గేమ్స్‌లో భాగంగా 35 ఏళ్ల కేటగిరిలో బాబా 110 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. అక్కడి భారతీయ అభిమానులు ఆయనను అభినందించారు.
News July 5, 2025
‘విశాఖలో టూరిజం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం’

విశాఖను అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. సన్ క్యాంపస్‌లోని విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. త్వరలోనే టూరిజం యూనివర్సిటీని విశాఖలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. పర్యాటక రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సన్ CMD శ్రీకాంత్ జాస్తి పాల్గొన్నారు.