News March 21, 2025

దుస్తులు మార్చుకుంటుండగా డోర్ తీశాడు: షాలినీ పాండే

image

ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్న సమయంలో నా అనుమతి లేకుండానే ఓ డైరెక్టర్ నా క్యారవాన్‌ డోర్ తీశాడు. అప్పుడు నేను బట్టలు మార్చుకుంటున్నా. అతడిపై నేను గట్టిగా కేకలు వేయడంతో వెళ్లిపోయారు. డైరెక్టర్ తీరుతో నేను ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా షాలినీ పలు సినిమాల్లో నటించారు.

Similar News

News March 23, 2025

రేపటి నుంచి డీఈఈ సెట్ దరఖాస్తులు

image

TG: రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈ సెట్‌కు ఈనెల 24 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నెల 25న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. సకాలంలో కౌన్సెలింగ్ పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు గతంలో కంటే రెండు నెలల ముందుగానే విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
వెబ్‌సైట్: <>deecet.cdse.telangana.gov.in<<>>

News March 23, 2025

మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు

image

AP: మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ACB కేసు నమోదు చేసింది. YCP హయాంలో 2020 సెప్టెంబర్‌లో పల్నాడు (D) యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అధికారులు ఏ1 నిందితురాలిగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.

News March 23, 2025

విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా: ఆమిర్

image

మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల తర్వాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆమిర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మద్యం అలవాటు లేని నేను, రోజుకో బాటిల్ తాగేవాడిని. ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నా’ అని తెలిపారు. ఆమిర్, రీనా వివాహం 1986లో జరగగా, 2002లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ 2005లో కిరణ్ రావును పెళ్లాడి 2021లో విడాకులిచ్చారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌‌తో డేటింగ్‌లో ఉన్నారు.

error: Content is protected !!