News March 21, 2025
నాగర్‌కర్నూల్: 26న పురుషులకు కుటుంబ నియంత్రణ ప్రత్యేక చికిత్స

పురుషులకు ఎలాంటి కొట్టు కోత లేకుండా N.S.V ఆపరేషన్ (నో స్కావెల్ వేసక్టమీ) ప్రత్యేక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరం నాగర్ కర్నూల్ జిల్లా సాధారణ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని మెడికల్ డాక్టర్ మధు ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ చేసుకోదలిచే మగవారు తమతో ఆధార్ కార్డుని వెంట తీసుకురావాలని, వివరాలకు ఆరోగ్య కార్యకర్త నంబర్‌కు 9014932408ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 5, 2025
బ్యాంకులకు ధీటుగా ఆన్లైన్ సేవలు అందిస్తాం: గన్ని వీరాంజనేయులు

ఏలూరు క్రాంతి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహా జనసభను డీసీసీబీ సీఈఓ సింహాచలం అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంతో సిబ్బంది కుమ్మక్కై సహకార సంఘాన్ని నష్టాల బాట పట్టించారని తీవ్రంగా విమర్శించారు. 2 నెలల్లో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ఆన్లైన్ సేవలు అందిస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
News November 5, 2025
మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అమ్మాయిల బాధ అర్థమవుతుంది: రష్మిక

జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది’ అని అన్నారు. రష్మిక కామెంట్లపై జగపతి బాబు చప్పట్లు కొట్టి అభినందించారు.
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్‌లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


