News March 21, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్➤ నంద్యాల: ఫరూక్ సతీమణి చివరి కోరిక.. HYDలోనే అంత్యక్రియలు➤ ఉమ్మడి జిల్లా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13కు వాయిదా➤ మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం➤ కర్నూలులో TDP నేత దారుణ హత్య.. ఎస్పీ వివరాల వెల్లడి ➤ కర్నూలులో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు➤ మంత్రాలయం: పల్లెల్లో దాహం కేకలు..!➤ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
Similar News
News March 23, 2025
Dy.CM పవన్ కళ్యాణ్‌ని సన్మానించిన బుడగ జంగాలు

కర్నూలు జిల్లా పూడిచెర్లకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ సన్మానించారు. క్యాబినెట్, అసెంబ్లీలో బుడగ జంగలకు ఎస్సీ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన కూటమి నాయకులకు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, MP బైరెడ్డి శబరికు కృతజ్ఞతలు తెలిపారు.
News March 22, 2025
ఏప్రిల్ 5 నుంచి రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు

ఏప్రిల్ 5 నుంచి 6 వరకు కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి నరేంద్ర ఆచారి తెలిపారు. శనివారం నగరంలోరాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు సంబంధించి బ్రోచర్‌ను పలువురు ఆవిష్కరించారు
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.