News March 21, 2025

ఏలూరు: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

image

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. కృష్ణా(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.

Similar News

News March 23, 2025

వ్యభిచార గృహంపై దాడి.. తెనాలి నిర్వాహకురాలి అరెస్ట్

image

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

News March 23, 2025

సూర్యాపేట: పది పరీక్షకు 25 మంది ఆబ్సెంట్

image

సూర్యాపేట జిల్లాలో రెండో రోజు జరిగిన పరీక్షకు 11,901 విద్యార్థులకు గాను 11,876 మంది హాజరుకాగా 25 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి పంపుతున్నామన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

News March 23, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ∆} కామేపల్లి తిరుపతమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన.

error: Content is protected !!