News March 21, 2025

LRS ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జనగామ కలెక్టర్

image

పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కోషోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి LRS ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులందరికి ఫోన్ కాల్ చేసి రాయితీని వినియోగించుకునేలా సిబ్బంది ప్రోత్సహించాలన్నారు.

Similar News

News March 23, 2025

KMM: బెట్టింగ్ బూతం.. జీవితాలు నాశనం!

image

ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో ఇప్పుడు అందరి నోటా బెట్టింగ్ మాటే. ఆటను అస్వాదించే వాళ్లు కొందరైతే, వ్యసనమై బెట్టింగ్‌లో రూ.లక్షల్లో నష్టపోయి SUICIDE చేసుకునే వాళ్లు కోకొల్లలు. ఖమ్మం జిల్లాలో ఇటీవలే ఇద్దరు యువకులు మృతి చెందారు. భద్రాద్రి జిల్లాలో అయితే ఒకరు కట్నం డబ్బు మొత్తాన్ని బెట్టింగ్‌లోనే పోగొట్టుకొని ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. యువతపై కుటుంబ సభ్యులు నిరంతరం దృష్టి సారించాలని పోలీసులు సూచించారు.

News March 23, 2025

మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు

image

AP: మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ACB కేసు నమోదు చేసింది. YCP హయాంలో 2020 సెప్టెంబర్‌లో పల్నాడు (D) యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అధికారులు ఏ1 నిందితురాలిగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.

News March 23, 2025

కానూరులో వ్యభిచార గృహంపై దాడి

image

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

error: Content is protected !!