News March 21, 2025

విశాఖ అధికారులతో జూమ్ కాన్ఫిరెన్స్

image

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.సి.డి.సి.డి.సర్వే, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతా, శిశు మరణాల రేటు తగ్గింపు, గర్భిణీల టీ.టీ-1, టీ-టీ-2 డోసులు, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. DMHO జగదేశ్వరరావు ఉన్నారు.

Similar News

News March 22, 2025

విశాఖ: పేద‌రిక నిర్మూల‌నకు పి-4 దోహ‌దం: కలెక్టర్

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన పి-4 విధానం పేద‌రిక నిర్మూల‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని, అధికారులు దానిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు సంఘాల ప్ర‌తినిధులు, అధికారుల‌తో శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. పి-4 విధానం ద్వారా పేద‌రిక నిర్మూల‌న సాధ్య‌ప‌డుతుందని, అంద‌రూ దీని ఆవ‌శ్య‌క‌త‌ను తెలుసుకొని భాగ‌స్వామ్యం కావాల‌న్నారు.

News March 22, 2025

విశాఖ: పాత హత్యా కేసును ఛేదించిన నగర పోలీసులు

image

విశాఖ జిల్లాలో 2021లో కొందరు దొంగలు జి శ్రీను అనే వ్యక్తి మర్మాంగం కోసి రోడ్డుపై హత్య చేశారు. ఈ హత్యపై ఎలాంటి ఆధారాలు లేక అప్పుడు కేసు క్లోజ్ చేశారు. ప్రస్తుతం విశాఖ పోలీసులు క్లోజైన కేసులను ఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను అనకాపల్లికి చెందిన లాలం గణేష్, పెద్ద గంట్యాడకు చెందిన తారకేశ్వరరావు చేసినట్లు గుర్తించారు. దీంతో శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. 

News March 22, 2025

విశాఖ: పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మందికి బదిలీలు

image

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మందిని బదిలీ చేస్తూ సీపీ శంకబద్ర బాచి ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ముగ్గురు ఏఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు. భీమిలి ఏఎస్ఐ ఎం సింహాచలంను ఆనందపురానికి, సీఎస్‌బి నుంచి చంటి కుమారును ఆరిలోవకు, సీఎస్‌బీ నుంచి శివరామకృష్ణును వన్‌టౌన్‌కు బదిలీ చేశారు.

error: Content is protected !!