News March 21, 2025

కలెక్టరేట్‌లో ఆల్ పార్టీ మిటింగ్

image

ఎన్నికల సమయంలోనే కాకుండా క్రమం తప్పకుండా సమావేశమై అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలను, సూచనలను పరిగణలోనికి తీసుకోని భారత ఎన్నికల కమిషన్‌కు పంపుతామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గౌతం తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్‌‌లో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ గౌతం సమావేశమయ్యారు.

Similar News

News March 2, 2026

నల్గొండలో పర్యటించనున్న మల్లికార్జున ఖర్గే

image

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు నల్గొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి 3 గంటలకు నాగార్జున సాగర్ బుద్దవనం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం రాష్ట్ర నాయకులతో భేటీ అయి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దిశా నిర్దేశం చేయనున్నారు.

News March 2, 2026

GNT: అంబటికి వైసీపీ నేతల పరామర్శ

image

అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్‌లకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు.

News March 2, 2026

ASF: దివ్యాంగులకు ఇక ఉచిత బస్సు ప్రయాణం

image

కొమరం భీమ్ జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లింగభేదం లేకుండా దివ్యాంగులందరికీ ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో విద్య, వైద్యం, ఉపాధి నిమిత్తం ప్రయాణించే వారికి భారీ ఉపశమనం లభించనుంది. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు జిల్లాలోని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.