News March 21, 2025

వచ్చే ఏడాది పోలవరం పూర్తి: సీఆర్ పాటిల్

image

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మోదీ వచ్చాక ₹15K కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఏడాదీ ₹12K కోట్లు ఇచ్చారని తెలిపారు. 2026 కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. దీంతో 2.91 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, విశాఖతో పాటు 540 గ్రామాలకు తాగు నీరు లభిస్తుందని చెప్పారు. 28.5 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

Similar News

News March 22, 2025

నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్

image

AP: తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను గౌరవిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కులం, మతం పాటించలేదని చెప్పారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలోని బుడగ జంగాలకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించా. ఇకపై ప్రతి జిల్లాలో పర్యటిస్తా. క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 22, 2025

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?

image

శీతల పానీయాల్లో మైక్రోప్టాస్టిక్‌లు ఉన్నట్లు థాయిలాండ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్యాకేజీతో సంబంధం లేకుండా మొత్తం 9 బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్‌ గుర్తించారు. ఏడాదికి ఓ వ్యక్తి సగటున 41.13 లీటర్ల కూల్‌డ్రింక్స్ తాగుతున్నట్లు గుర్తించారు. కూల్‌డ్రింక్స్ జీవక్రియ, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మైక్రోప్లాస్టిక్ శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి మరింత పరిశోధనలు చేయనున్నారు.

News March 22, 2025

ట్విటర్ ‘పిట్ట’కు భలే ధర

image

ట్విటర్ పేరు వినగానే ‘పిట్ట’ లోగోనే గుర్తుకొస్తుంది. ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత దాని పేరు, లోగోను Xగా మార్చారు. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్‌ బిల్డింగ్‌కు 12F పొడవు, 9F వెడల్పు, 254KGల బరువుతో ఉన్న పిట్ట లోగోను తొలగించారు. తాజాగా దాన్ని వేలం వేయగా 34,375 డాలర్లు(రూ.30 లక్షలు) పలికింది. 2006లో దీన్ని 15 డాలర్లతో తయారుచేయించినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.

error: Content is protected !!