News March 22, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔పలుచోట్ల ఇఫ్తార్ విందు ✔టెన్త్ పరీక్షలు.. తనిఖీ చేసిన కలెక్టర్లు ✔CMను కలిసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ✔వరల్డ్ వైడ్ కాంటెస్ట్‌లో గద్వాల ఇన్‌స్టా రీల్ ✔నాగర్‌కర్నూల్:Way2Newsతో చెంచులు ✔అయిజ: వేరుశనగతో వెళ్తున్న ఆటో బోల్తా ✔NGKL: ‘ఈనెల 26న వేసెక్టమి ఆపరేషన్లు’ ✔ఘనంగా ‘ప్రపంచ కవితా దినోత్సవం’ ✔NRPT: భార్యను చంపిన భర్త అరెస్ట్ ✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
Similar News
News March 22, 2025
డీలిమిటేషన్: ప్రాంతీయ భాషలో నేమ్ బోర్డ్స్!

డీలిమిటేషన్ మీట్‌కు వివిధ రాష్ట్రాల నుంచి CMలు, పార్టీల ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కనిపించిన ఓ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్‌లో ఉన్నట్లు ఆయా పార్టీల ప్రతినిధుల పేర్లను ఇంగ్లిష్‌తో పాటు వారి భాషల్లో నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. CM రేవంత్ & KTR వద్ద తెలుగు బోర్డులు కనిపించాయి. కాగా, మొదటి నుంచి TN ప్రభుత్వం హిందీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
News March 22, 2025
ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.
News March 22, 2025
రాష్ట్రంలో 10,954 ఉద్యోగాలు

TG: రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ VRAల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.