News March 22, 2025
కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకోవాల్సిందే: పేర్ని

AP: కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుని బతకాల్సిందేనని YCP నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ‘మా పార్టీ నేతల అరెస్టులతో జగన్ పరపతి ఏమీ తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే జగన్‌కే సాధ్యం. ఈ విషయంలో చంద్రబాబు, పవన్.. జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News March 24, 2025
ఉగాదిలోపు రాష్ట్రానికి కొత్త కమల దళపతి!

TG: BJP కొత్త రాష్ట్రాధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉగాదిలోపు ఏ క్షణంలోనైనా ఈ ప్రకటన ఉండొచ్చని ముఖ్య నేతలు చెబుతున్నారు. నిన్న కిషన్ రెడ్డి హుటాహుటిన హస్తినకు వెళ్లడమూ ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే BJP MLAలు, MPలతో పాటు పలువురు సీనియర్ల అభిప్రాయాలను అధిష్ఠానం సేకరించింది. రేసులో బండి సంజయ్, రాంచందర్ రావు, లక్ష్మణ్, అర్వింద్, DK అరుణ, ఈటల, పాయల శంకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
News March 24, 2025
IPL: నేడు వైజాగ్‌లో LSGvsDC

ఐపీఎల్‌లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 5 సార్లు తలపడగా LSG 3, DC 2 మ్యాచుల్లో గెలిచింది. వేలంలో ఈ రెండు జట్ల మధ్య పంత్, KL రాహుల్ స్వాప్ అవ్వడం కూడా ఈ మ్యాచుపై మరింత ఆసక్తిని పెంచుతోంది. రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ చూడవచ్చు.
News March 24, 2025
CUET UG దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకునేందుకు NTA అవకాశం కల్పించింది. మే 8 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.
వెబ్‌సైట్: https://cuet.nta.nic.in/