News March 22, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>పాడేరు: మీకోసం కార్యక్రమానికి 129ఫిర్యాదులు>అనంతగిరి: కాఫీ, మిరియాల తోటలు దగ్ధం>మారేడుమిల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి>కూనవరంలో అటవీ పరిరక్షణకు కమిటీలు>ముంచంగిపుట్టు: మత్స్య కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి>అల్లూరి జిల్లాలో 89మంది విద్యార్థులు గైర్హాజర్>కొయ్యూరు: దుప్పి మాంసంతో పట్టుబడిన వ్యక్తులు>దేవీపట్నంలో శతాధిక వృద్ధురాలు మృతి
Similar News
News March 22, 2025
డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్

TG: డీలిమిటేషన్‌పై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ మోసం చేస్తోంది. సొంత ఎజెండాతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. డీలిమిటేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. దీనిపై త్వరలోనే HYDలో బహిరంగ సభ ఉంటుంది. ఇది దక్షిణాది పార్టీల సమస్య కాదు ప్రజల సమస్య. స్టాలిన్‌తో కలసి పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తాం. అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తాం’ అని చెన్నైలో మీడియాతో పేర్కొన్నారు.
News March 22, 2025
శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News March 22, 2025
విరాట్ మంచోడు.. కానీ అది మైదానంలో దిగనంతవరకే: సాల్ట్

విరాట్ కోహ్లీపై ఆయన ఆర్సీబీ టీమ్ మేట్ ఫిల్ సాల్ట్ ప్రశంసలు కురిపించారు. ‘విరాట్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉంటారు. కానీ అది మైదానంలో దిగనంతవరకే. గ్రౌండ్‌లో ఆయన తీవ్రత వేరే స్థాయిలో ఉంటుంది. యుద్ధాన్ని కోరుకుంటారు. ఈ సీజన్లో ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. సాల్ట్ గత సీజన్‌లో కేకేఆర్‌కు ఆడారు.