News March 22, 2025
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ MLA

హైదరాబాద్‌లోని FTCCIలో ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో శుక్రవారం బడ్జెట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిర్పూర్ MLA డా.పాల్వాయి హరీశ్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో అనేక కాకి లెక్కలు చెప్పిందని ఆరోపించారు. బడ్జెట్ మీద చూపిస్తున్న అంకెలకు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. కార్యక్రమంలో సాయిప్రసాద్, శ్రీనివాస్ తదితరులున్నారు.
Similar News
News November 20, 2025
HYD: ఓయూ, SCCL మధ్య ఒప్పందం!

ఉస్మానియా విశ్వ విద్యాలయం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) మధ్య కీలక ఒప్పందం కుదురుచుకుంది. ఎస్సీసీఎల్ సీఎస్ఆర్ కింద ఆర్థిక సంవత్సరం 2025-2026 కోసం స్కాలర్‌షిప్ కార్యక్రమం ఆమోదించబడింది. ఈ ఒప్పంద పత్రాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య నరేష్ రెడ్డి సంతకం చేశారు. పరిశోధనా రంగానికి మద్దతుగా ఈ కార్యక్రమానికి రూ.కోటి మంజూరు చేశారు.
News November 20, 2025
HNK: ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో వారం రోజులుగా నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలు నేటితో ముగిసాయి. ముగింపు వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేటి సమాజంలో మానవుడికి టెక్నాలజీ ఎంత ముఖ్యమో, గ్రంథాలయాలు కూడా అంతే ముఖ్యమన్నారు. హనుమకొండ జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.
News November 20, 2025
రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొన్నం

కరీంనగర్ జిల్లాలో రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎల్ఎండీ కాలనీ వద్ద చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లోని సారధి కళామందిర్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు.


