News March 22, 2025

ఇల్లందు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం: జీఎం కృష్ణయ్య

image

బొగ్గు ఉత్పత్తిలో 2025 ఆర్థిక సంవత్సరానికి ఇల్లందు ఏరియాకు కేటాయించిన 41.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 11రోజుల ముందుగానే అధిగమించామని ఏరియా జీఎం కృష్ణయ్య తెలిపారు. మార్చి నాటికి ఏరియాకు కేటాయించిన దానికంటే ఎక్కువగా శుక్రవారం 41.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 100.12% అన్ని ఏరియాలకంటే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఇల్లందు ఏరియా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

Similar News

News January 7, 2026

TU కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య రాంబాబు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య రాంబాబును టీయూ వీసీ ఆచార్య యాదగిరి రావు నియమించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆచార్య రాంబాబు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్, కామర్స్ డీన్, పరీక్షల విభాగంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనను నియమించడంపై VC, రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News January 7, 2026

రేపట్నుంచి ‘ఆవకాయ-అమరావతి’ ఉత్సవాలు

image

AP: ‘ఆవకాయ-అమరావతి’ పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో రేపట్నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలను చాటిచెప్పేలా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి పున్నమి ఘాట్ వద్ద జరిగే ప్రారంభోత్సవంలో CM CBN, Dy.CM పవన్ పాల్గొననున్నారు.

News January 7, 2026

SVU స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

image

తిరుపతి SVU స్నాతకోత్సవానికి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2018 నుంచి 2024 వరకు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 63 నుంచి 68వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు www.svuexams.com ద్వారా దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో సమర్పించాలి. స్నాతకోత్సవం విద్యార్థుల ఎదురుచూపులని ఇటీవల Way2Newsలో వార్త వచ్చిన విషయం తెలిసిందే.