News March 22, 2025

వరంగల్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

image

వరంగల్ రైల్వే స్టేషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్‌లో భాగంగా రూ.25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.

Similar News

News January 16, 2026

KNR: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల పోస్టర్‌ ఆవిష్కరణ

image

కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 9 సంస్థల్లో ఉత్తమ బోధనతో పాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు.పూర్తి వివరాలకు www.tgmreistelangan.cgg.gov.in సంప్రదించాలన్నారు

News January 16, 2026

MBNR:CM పర్యటన..ట్రాఫిక్ మళ్లింపు2/2

image

1.జడ్చర్ల నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు
→SVS హాస్పిటల్ ముందు నుండి, RTC బస్టాండ్, వన్ టౌన్ చౌరస్తా మీదుగా రాయచూర్ రోడ్డు చేరుకోవచ్చు.
2.నాగర్‌కర్నూల్ నుంచి MBNR టౌన్‌లోకి వచ్చే వాహనాలు
→భూత్పూర్ ఫ్లైఓవర్ క్రింది భాగంలో లెఫ్ట్ తీసుకొని, తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి రావచ్చు.
3.కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్ వచ్చే వాహనాలు
→NH-44 నందు తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి ప్రవేశించవచ్చు.

News January 16, 2026

దేశ రాజధానిలో వికారాబాద్ డోలు దెబ్బ

image

TG రాష్ట్రం నుంచి 30 మంది ఒగ్గు కళాకారులు ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్-2026లో ప్రదర్శన చేసేందుకు ఎంపికయ్యారు. మన జిల్లా నుంచి 16 మంది ఎంపిక అయ్యారని ఒగ్గు కళాకారుడు బీరప్ప తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రముఖుల సమక్షంలో ప్రదర్శన అవకాశం కల్పించిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత ఒగ్గు రవికి కృతజ్ఞతలు తెలిపారు.