News March 22, 2025
సాధారణ భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపాథ్యంలో సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈనెల 28 నుంచి జరిగే జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. జాతర నిర్వహణలో ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి శాఖకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
Similar News
News March 22, 2025
గుడిహత్నూర్: బాలికకు అబార్షన్.. RMP అరెస్ట్

బాలికకు అబార్షన్ చేసిన కేసులో RMP వైద్యుడు సూర్యవంశీ దిలీప్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గుడిహత్నూర్ మండలం గురిజ గ్రామంలో ఇటీవల పసికందు మృతదేహం లభ్యం అవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా 15 ఏళ్ల మైనర్ బాలికకు అబార్షన్ చేసినట్లు గుర్తించారు. దీంతో అతడి క్లినిక్‌ను సీజ్ చేసి అరెస్ట్ చేశారు.
News March 22, 2025
డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్

TG: డీలిమిటేషన్‌పై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ మోసం చేస్తోంది. సొంత ఎజెండాతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. డీలిమిటేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. దీనిపై త్వరలోనే HYDలో బహిరంగ సభ ఉంటుంది. ఇది దక్షిణాది పార్టీల సమస్య కాదు ప్రజల సమస్య. స్టాలిన్‌తో కలసి పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తాం. అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తాం’ అని చెన్నైలో మీడియాతో పేర్కొన్నారు.
News March 22, 2025
శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.