News March 22, 2025
చిట్యాల మండల వాసులైన ఇద్దరికి ప్రభుత్వ కొలువులు

తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన కొలువుల ఫలితాల్లో చిట్యాల మండల వాసులైన ఇద్దరిని ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. జూకల్‌కు చెందిన దొంతు మాధవరెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా, ముచినిపర్తి గ్రామానికి చెందిన గుండెపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిఆర్ శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా సెలెక్ట్ కాగా.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను తీసుకున్నట్లు వారు చెప్పారు.
Similar News
News March 23, 2025
మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ కీలక నిర్ణయాలు

మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణసాయం కింద రూ.50వేలు, ఆయుధాలు సరెండర్ చేస్తే వాటి స్థాయిని బట్టి రూ.5లక్షల వరకు ఇవ్వనుంది. రూ.5లక్షలకు ఆపై రివార్డు ఉన్న నక్సల్స్ లొంగిపోతే ఇంటి లేదా వ్యవసాయ భూమి ఇస్తుంది. భూమి అందుబాటులో లేకపోతే రూ.2లక్షల నగదు అందజేయనుంది. అలాగే పెళ్లి కాని, వితంతు మహిళలకు రూ.లక్ష సాయం చేయాలని నిర్ణయించింది.
News March 23, 2025
కూటమి ప్రభుత్వం జగన్‌పై విష ప్రచారం చేస్తుంది: పర్వత రెడ్డి

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విషపూరితమైన ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. నాడు నేడు ద్వారా జగన్ 45 వేల పాఠశాలలను ఆధునీకరణ చేశారన్నారు. అలాంటి జగన్‌ను.. మంత్రి నారా లోకేశ్ పాఠశాలలను నిర్వీర్యం చేశారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేటర్‌లు, నేతలు పాల్గొన్నారు
News March 23, 2025
BREAKING: కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల వరకు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌లో వాన పడుతుందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.