News March 25, 2024

మీడియా సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ (31)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తులో ఉన్న కంట్రోల్ రూమ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడానికి, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News July 8, 2024

WGL: మనస్తాపంతో మహిళా రైతు బలవన్మరణం

image

రెండు సార్లు విత్తనాలు వేసినా.. మొలకెత్తకపోవడంతో మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వర్ధన్నపేట మున్సిపాలిటీలోని గుబ్బెడి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన కమలమ్మ 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తోంది. జూన్ నెలలో అప్పు తీసుకొచ్చి విత్తనాలు వేసినా వర్షాలు లేక మొలకెత్తలేదు. విత్తనాలు మొలకెత్తక, తెచ్చిన అప్పు తీర్చలేక మనస్తాపానికి గురైన కమలమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News July 8, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 ధర వచ్చింది. అలాగే ఏసీ 341 రకం మిర్చికి రూ.15,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,500 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి.

News July 8, 2024

WGL: నేటి నుంచి యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు

image

అసిఫాబాద్ రోడ్డు నుంచి రేచిని రోడ్డు మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజరు రైళ్లను ఈనెల 8 నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌స్రెస్, 17233/34 భాగ్యనగర్ ఎక్స్‌స్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు, 17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.