News March 22, 2025
గూడూరు: రోడ్డుపై మొసలి కలకలం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటలల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Similar News
News February 28, 2026
మణుగూరు: 74 శాతం బొగ్గు ఉత్పత్తి

మణుగూరు ఏరియాలో ఫిబ్రవరికి గాను 74 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైనట్లు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ వెల్లడించారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. 10.16 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 7.50 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కార్మికులు, అధికారులు కృషి చేయాలని కోరారు.
News February 28, 2026
కీరదోసలో బూడిద తెగులును ఎలా నివారించాలి?

కీరదోసలో బూడిద తెగులు ఆశిస్తే ఆకుల ఉపరితలంపై, కాడలపై తెల్లటి బూడిద వంటి పొడి ఏర్పడుతుంది. ఉద్ధృతి ఎక్కువైతే కాండం, పూతపై కూడా ఈ పొడి కనిపిస్తుంది. ఇది ఆకు మొత్తం కప్పేసి చివరికి ఆకులు పసుపు రంగులోకి మారి కాండంతో సహా ఎండిపోతాయి. దీనివల్ల మొక్కలు బలహీనపడతాయి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి థయోఫనేట్ మిథైల్ (75% WG) 2.5 గ్రా. లేదా బినామిల్ 50% WP 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News February 28, 2026
ADB: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కామారెడ్డి MLA రమణా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాయల్ శంకర్, MLC అంజి రెడ్డి, MLAలు హరీష్ బాబు, రామారావు పాటిల్ పాల్గొన్నారు.


