News March 22, 2025
రోహిత్‌లా విరాట్ రిస్క్ తీసుకోలేరు: ఫించ్

దూకుడుగా ఆడేందుకు రోహిత్‌కు ఉన్న అవకాశం విరాట్‌కు లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ అభిప్రాయపడ్డారు. టీమ్ పరిస్థితుల్ని బట్టి చూస్తే రోహిత్‌లా రిస్క్ తీసుకోలేరని పేర్కొన్నారు. ‘ముంబైలో రోహిత్ తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఆయన స్కోరు ప్రభావం చూపించదు. అందుకే శర్మ స్వేచ్ఛగా ఆడతారు. కానీ ఆర్సీబీ జట్టు విరాట్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన స్కోర్ చేస్తేనే జట్టుకు మంచి పునాది లభిస్తుంది’ అని విశ్లేషించారు.
Similar News
News March 23, 2025
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు

రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు(18) డకౌటైన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్ సరసన చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్, పీయూష్ చావ్లా(16) ఉన్నారు. ఇవాళ చెన్నైతో మ్యాచ్‌లో 4 బాల్స్ ఆడిన హిట్ మ్యాన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లారు.
News March 23, 2025
రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా?

ప్రస్తుత బిజీ జీవితంలో నిద్రాసమయం కుంచించుకుపోతోంది. ఎప్పుడు పడితే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కానీ రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నిద్ర నాణ్యత కోల్పోవడమే కాకుండా జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. అలాగే నిద్రలేచిన వెంటనే అలసట, నీరసంగా ఉండి ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. రోగనిరోధకశక్తి బలహీనపడి అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.
News March 23, 2025
వర్ష బాధిత రైతులకు రేపు జగన్ పరామర్శ

AP: మాజీ సీఎం జగన్ రేపు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు చేతికొచ్చిన అరటి తోటలు నేలకొరిగాయి. ఈ క్రమంలో ఆయన వాటిని పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఈ రాత్రికి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అవుతారు. ఈ నెల 27న జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.