News March 22, 2025

సోనాలలో హల్చల్ చేసిన గంగవ్వ

image

సోనాలలోని ఓ పాఠశాలలో శుక్రవారం రాత్రి జరిగిన వార్షికోత్సవంలో మై విలేజ్ షో యూ ట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పాల్గొని సందడి చేశారు. గంగవ్వను చూడడానికి ప్రేక్షకులు దండెత్తారు. ప్రేక్షకులతో మై విలేజ్ షో యూట్యూబ్లో చేసిన అనుభవాలను పంచుకున్నారు. గంగవ్వతో సెల్ఫీలు దిగడానికి యువత ఆసక్తి కనబరిచారు.

Similar News

News March 23, 2025

ADB: ఇంటివద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

image

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఆదిలాబాద్ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. శనివారం ఆమె కౌంటర్‌ను ప్రారంభించారు. భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే కార్గో సేవల ద్వారా మీ ఇంటి వద్దనే తలంబ్రాలు అందజేస్తామన్నారు.

News March 23, 2025

ADB: కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

image

ఆదిలాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని, కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న కేసులపై ఆయన ఆరా తీశారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. కమాండ్ కంట్రోల్స్, సీసీ కెమెరాల తీరును పర్యవేక్షించారు. అంతకుముందు ఎస్పీకి డీఎస్పీ జీవన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

News March 22, 2025

ADB: పరీక్షకు 23 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,039 మంది విద్యార్థులకు గాను 10,016 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించినట్లు వివరించారు.

error: Content is protected !!