News March 22, 2025

ధర్మపురి: అగ్ని జ్వాలలో లక్ష్మీనరసింహస్వామి దివ్య రూపం!

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో సుదర్శన నారసింహ హోమ పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిజ్వాలలో నరసింహస్వామి అపురూప దృశ్యం దర్శనమిచ్చింది. అగ్నిజ్వాలలో లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీకు లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.

Similar News

News July 5, 2025

జనవరి 27 నుంచి యాదాద్రి చల్లూరు మేడారం జాతర

image

రాజాపేట మండలం చల్లూరులోని యాదాద్రి చల్లూరు మేడారం జాతర 2026 జనవరి 27వ తేదీ నుంచి ఐదు రోజులపాటు జరగనుందని మాజీ సర్పంచ్ వంచ వీరారెడ్డి, నిర్వాహకులు ఈరోజు తెలిపారు. జనవరి 27న మంగళవారం ఎల్లమ్మకు బోనాలు, 28న బుధవారం సారలమ్మ గద్దెపైకి రావడం, 29న గురువారం సమ్మక్క గద్దెపైకి రావడం, 30న శుక్రవారం మొక్కులు చెల్లించుకోవడం, 31న శనివారం అమ్మవార్ల వన ప్రవేశం ఉంటుందన్నారు.

News July 5, 2025

2.78 లక్షల మందితో మెగా PTM సమావేశాలు: కలెక్టర్

image

NTR జిల్లాలోని 1,500 పాఠశాలల్లో జులై 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్(PTM) జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశా చెప్పారు. శనివారం PTM కార్యక్రమ సన్నాహకాలపై ఆయన మాట్లాడుతూ.. స్కూల్స్‌లోని 2 లక్షల మంది విద్యార్థులతో పాటు జిల్లాలోని 186 జూనియర్ కళాశాలల్లోని 78,162 స్టూడెంట్స్, పేరెంట్స్ సైతం PTM సమావేశాలకు హాజరవుతారన్నారు. PTM సమావేశానికి హాజరు కావాలని విద్యార్థులే పేరెంట్స్‌కు ఆహ్వానం అందిస్తారన్నారు.

News July 5, 2025

ఈ ఏడాది మెగా PTM స్పెషాలిటీ ఏమిటంటే.?

image

NTR జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో కూడా ఈనెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ (PTM) జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశా చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. త‌ల్లిదండ్రుల‌తో పాటు పూర్వ విద్యార్ధులు కూడా ఈ సమావేశాలకు హాజరై తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రత్యేకంగా నిర్వహిస్తామన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీసే విధంగా పలు పోటీలు జరుగుతాయన్నారు.