News March 22, 2025
KMR: ఎల్‌ఆర్‌ఎస్ రాయితీపై విస్తృత ప్రచారం: కలెక్టర్

ఎల్‌ఆర్‌ఎస్ రాయితీపై విస్తృత ప్రచారం చేస్తున్నామని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. LRS పై రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు దారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నామని, ఈ నెల 31 వరకు 25% రాయితీ వర్తిస్తుందని ప్రజలకు వివరిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
Similar News
News March 24, 2025
TODAY HEADLINES

* KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్
* రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్
* TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం నోటీసులు
* 27న పోలవరానికి సీఎం చంద్రబాబు
* వారు కూడా దక్షిణ భాషలు అర్థం చేసుకోవాలి: పవన్
* ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ
* RRపై SRH విజయం, MIపై చెన్నై విక్టరీ
* బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS
News March 24, 2025
HYD: సైబర్ నేరగాలపై టీజీసీఎస్బీ కీలక సూచన

HYD: కార్పొరెట్ కంపెనీల్లో అన్‌లైన్ చెల్లింపులపై జాగ్రత్త వహించాలని టీజీసీఎస్బీ శిఖా గోయల్ తెలిపారు. గోయల్ మాట్లాడుతూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాల్స్ వచ్చినట్లు అనిపిస్తే లావాదేవీలు చేసే ముందు ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ ద్వారా ధృవీకరించుకుని చెల్లింపులు చేయాలని సూచించారు. ఇటీవల ఓ కంపెనీ ఎండీ పేరుతో అకౌటెంట్‌కి సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారని పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్సర్ చేశారన్నారు.
News March 24, 2025
సుపరిపాలన అందించే రాష్ట్రాలు బలహీనపడాలా?: కేశినేని నాని

AP: నియోజకవర్గాల పునర్విభజన వల్ల AP, TG, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీ కేశినేని నాని అన్నారు. జనాభా ప్రాతిపదికన చేపట్టనున్న ఈ ప్రక్రియ న్యాయమైనదేనా? అని SMలో ప్రశ్నించారు. సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా అని ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజన జాగ్రత్తగా నిర్వహించకపోతే ఉత్తర-దక్షిణ విభేదాలు పెరుగుతాయని హెచ్చరించారు.