News March 22, 2025
గద్వాల: ‘ఎవరైనా వేధిస్తే మాకు చెప్పండి’

గద్వాల మండలం గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ మొగలయ్య హాజరై ప్రసంగించారు. షీటీం సేవల గురించి, వేధింపులకు గురైనప్పుడు షీటీంను సంప్రదించాల్సిన ఆవశ్యకత, విద్య ప్రాముఖ్యత తెలియజేశారు. మహిళలు తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలబడాలన్నారు.
Similar News
News March 24, 2025
నస్రుల్లాబాద్: చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన కీసరి రాములు(37) ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News March 24, 2025
ఏషియన్ పోటీలకు మెదక్ జిల్లా క్రీడాకారిణి ఎంపిక

ఏషియన్ అండర్ 15 మహిళల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి సాయి సిరి ఎంపికైనట్లు మెదక్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. జనవరిలో భారత జట్టు ఎంపిక ప్రక్రియలో సాయి సిరి ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల తైవాన్‌లో 26 నుంచి 30 వరకు జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనున్నారు.
News March 24, 2025
ఖైరతాబాద్: కారు కడిగితే రూ.10,000 కట్టాల్సిందేనా..?

అదేంటి మా కారు మేము కడిగితే రూ.10వేలు ఎందుకు కట్టాలి అని అనుకుంటారు. మీరు కాదులెండి. జలమండలి సరఫరా చేసే నీటితో విచ్చలవిడిగా కార్లు కడిగిన వారికి ఈ భారీ జరిమానా విధించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సరఫరా చేస్తున్న నీటిని విచ్చలవిడిగా వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయినా మంచినీటితో కారును ఎందుకు కడగాలి? అనేది మనం ఆలోచించాలి.