News March 25, 2024

రాజమండ్రి: ‘ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి’

image

రాజకీయ పార్టీలు కచ్చితంగా ఎన్నికల నిబంధనలను పాటించాలని రూరల్ నియోజకవర్గ ఆర్వో తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షోలు, ర్యాలీలు, సభలు, మైక్‌లో ప్రచారం చేసుకునే విషయంలో 48 గంటల ముందుగా ఎన్నికల అధికారి నుండి అనుమతి తీసుకోవాలన్నారు. అందుకోసం సువిధ యాప్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలు ఆర్వో కార్యాలయంలో అందచేయాలని పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

రాజమండ్రి కల్తీ పాలు ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య

image

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ గురువారం (1:25 PM) హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం 9 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 11 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి వరకు 8 మంది మృతి చెందగా.. నేడు చౌడేశ్వర్ నగర్‌కు చెందిన జి.వెంకటలక్ష్మి (69) మృతి చెందినట్లు తెలిపారు.

News March 5, 2026

రాజమండ్రి: 7, 8 తేదీల్లో జిల్లాలో ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పర్యటన

image

జాతీయ షెడ్యూల్‌ కులాల కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా ఈనెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయన 6వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం చేరుకొని ఓఎన్‌జీసీ అతిథి గృహంలో బస చేస్తారు. 7న జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహింనున్నారు. అనంతరం ధవళేశ్వరంలో నిర్వహించే వర్క్‌షాప్‌లో పాల్గొని, అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

News March 5, 2026

రాజమండ్రి: ఈనెల 8న జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’

image

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(SAAP) ఆదేశాల మేరకు ఈ నెల 8న తూర్పుగోదావరి జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి(DSDO) డి.ఎమ్.ఎమ్. శేషగిరి తెలిపారు. హుకుంపేటలోని బొప్పన స్పోర్ట్స్ క్లబ్‌లో టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు, ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.