News March 22, 2025
బల్లులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఇంటి గోడలపై నెమలి ఈకలను అంటించండి. వెల్లుల్లి రిబ్బల్ని గదులలో ఉంచితే వాటి వాసనకు బల్లులు దూరంగా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి అవి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పెట్టండి. నల్ల మిరియాలను నీటిలో కలిపి గోడలపై స్ప్రే చేయాలి. గుడ్డు పెంకుల్ని బల్లులున్న ప్రదేశాల్లో ఉంచండి. నాప్తలీన్ గోలీల వాసన బల్లులకు పడదు. వీటితో పాటు ఇంటిలో బూజు చెత్త లేకుండా క్లీన్‌గా ఉంచండి. తద్వార బల్లులు రాకుండా ఉంటాయి.
Similar News
News March 24, 2025
మన టాలెంట్‌ను ఆస్కార్ గుర్తించలేదు: దీపిక

భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప చిత్రాలు తెరకెక్కినా ఆ కథలను, నటీనటుల ప్రతిభను ‘ఆస్కార్’ గుర్తించలేదని బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె అన్నారు. మనకు రావాల్సిన అవార్డులను కూడా లాగేసుకున్నారంటూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే RRRలోని నాటునాటు పాటకు అకాడమీ అవార్డు వచ్చినప్పుడు అక్కడే ఉన్న తాను ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు దీపిక చెప్పారు. ఆ క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపారు.
News March 24, 2025
హోరెత్తిస్తున్న షేర్లు: రూ.5లక్షల కోట్ల లాభం

స్టాక్‌మార్కెట్లు దూకుడు మీదున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ దుమ్మురేపుతున్నాయి. MON మిడ్ సెషన్‌కు నిఫ్టీ 23,616 (+270), సెన్సెక్స్ 77,834 (+930) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, FIIs తిరిగి పెట్టుబడులు ఆరంభించడం, డాలర్‌తో రూపాయి బలపడుతుండటం, బ్యాంకింగ్ స్టాక్స్ జోరు, ఇన్వెస్టర్ల విశ్వాసం పెరగడమే ఇందుకు కారణాలు.
News March 24, 2025
మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఇటీవల రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.