News March 22, 2025

చందుర్తి : అకాలవర్షంతో పంట నష్టం

image

అకాల వర్షం మండలవ్యాప్తంగా అపార నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టింది. శుక్రవారం సాయంత్రం కురిసిన బలమైన ఈదురుగాలులతో కూడిన వానకు పంటలు దెబ్బతిన్నాయి. చందుర్తి పాటు, మల్యాల, తిమ్మాపూర్, రామన్నపేట, నర్సింగాపూర్ గ్రామాల్లో సుమారు గంటపాటు కురిసిన వర్షానికి పలువురు రైతులకు చెందిన వరి పంట నేల రాలిపోయింది. పంట చేతికందే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలకు నష్టపోవడంతో రైతులు కంటతడి పెట్టారు.

Similar News

News March 24, 2025

నా వ్యాఖ్యల పట్ల చింతించడం లేదు: కునాల్

image

MH డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేపై కమెడియన్ <<15866900>>కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు<<>> వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలపై ఏ మాత్రం చింతించడం లేదని ఆయన పోలీసులకు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు తనకు డబ్బులిచ్చి వ్యాఖ్యలు చేయించాయనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను సీఎం ఫడణవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు.

News March 24, 2025

PHOTOS: జపాన్‌లో ఎన్టీఆర్

image

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవర’ మూవీ త్వరలోనే జపాన్‌లోనూ రిలీజ్ కానుంది. ఈ ప్రమోషన్లకు జపాన్ వెళ్లిన యంగ్ టైగర్ NTR తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. RRR సినిమా సమయంలోనూ ఆయన జపాన్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.

News March 24, 2025

GHMC: రూ.2.95 కోట్లతో వాటర్ డ్రెయిన్, VDCC రోడ్లు..!

image

చాంద్రాయణగుట్ట బండ్లగూడలో గల ప్రోగ్రెస్ స్కూల్ నుంచి క్రిస్టల్ టౌన్, డెలివరీ కొరియర్ సర్వీస్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మించనున్నామని GHMC తెలిపింది. అంతేకాక వీడీసీసీ రోడ్ నిర్మాణాలకు రూ.2.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం తెలిపినట్లుగా GHMC తాజాగా నేడు పేర్కొంది.

error: Content is protected !!