News March 22, 2025

సినిమా నటులకు పాడు సంపాదన ఎందుకు? నారాయణ

image

సినిమా నటులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును తప్పుడు పనులకు దుర్వినియోగం చేయోద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కోకాకోలా యాడ్ ఇచ్చేవారని అయితే రక్తదానం చేస్తూ రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత అటువంటి చేయనని చిరంజీవి తనతో చెప్పారన్నారు.

Similar News

News March 24, 2025

GHMC: రూ.2.95 కోట్లతో వాటర్ డ్రెయిన్, VDCC రోడ్లు..!

image

చాంద్రాయణగుట్ట బండ్లగూడలో గల ప్రోగ్రెస్ స్కూల్ నుంచి క్రిస్టల్ టౌన్, డెలివరీ కొరియర్ సర్వీస్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మించనున్నామని GHMC తెలిపింది. అంతేకాక వీడీసీసీ రోడ్ నిర్మాణాలకు రూ.2.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం తెలిపినట్లుగా GHMC తాజాగా నేడు పేర్కొంది.

News March 24, 2025

అలా అడిగానని అందరూ నాకు పొగరు అనుకునేవారు: యశ్

image

కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో అందరూ తనను పొగరుబోతు అనుకునేవారని ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ ఓ ఈవెంట్‌లో తెలిపారు. ‘‘ఏ సినిమా ఆఫర్ వచ్చినా ఆ స్క్రిప్ట్ మొత్తం కాపీ ఇవ్వమని అడిగేవాడిని. దీంతో నాకు ‘పొగరుబోతు’ అన్న ముద్ర వేశారు. నేను నటించబోయే సినిమా కథ ఏంటో, నా పాత్ర ఏంటో తెలియకుండా ప్రాజెక్ట్ ఎలా అంగీకరించగలను? అలాంటి సమయంలో నాకు హిట్ అందించిన ‘మొగ్గిన మనసు’ టీమ్‌ను ఎప్పటికీ మరచిపోలేను’’ అని తెలిపారు.

News March 24, 2025

రేవంత్ వల్లే శాంతిభద్రతలు పడిపోయాయి: హరీశ్ రావు

image

TG: ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటన యావత్ సమాజాన్ని కలిచివేసిందన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి సీఎం రేవంత్(హోంమంత్రి) చేతగాని పాలనే కారణమని మండిపడ్డారు.

error: Content is protected !!