News March 22, 2025
జిల్లాలో రక్తహీనత తగ్గింది: కేంద్ర బృందం

రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పలు పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తున్న కారణంగానే జిల్లాలో రక్తహీనత తగ్గిందని జిల్లాలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం అభిప్రాయపడింది. కలెక్టర్ అంబేడ్కర్‌ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత గుర్తించిన అంశాలను కలెక్టర్‌కు వివరించారు.
Similar News
News September 27, 2025
విచారణ వేగవంతానికి ఈ-సమన్స్ అమలు చేయాలి: VZM SP

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్
అధికారులు, హెచ్సీలతో SP దామోదర్ శనివారం జూమ్ మీటింగు నిర్వహించారు. నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయ స్థానాల్లో శిక్షపడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమన్నారు. కేసుల విచారణ మరింత వేగవంతంగా జరిపించేందుకు ఈ-సమన్స్ అమలు చేయాలన్నారు.
News September 27, 2025
వర్షాలను దృష్టిలో ఉంచుకొని పండగ ఏర్పాట్లు: RDO

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పైడితల్లి పండగ ఏర్పాట్లను చేసుకోవాలని RDO దాట్ల కీర్తి తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. గుడి లోపల దేవస్థానం సిబ్బంది ఎక్కువ మంది ఉండడంతో భక్తుల తోపులాట జరుగుతోందన్నారు.
News September 27, 2025
VZM: రేపటి నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్వయం సహాయక సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ గొప్ప వేదికగా నిలవనుందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. తన ఛాంబర్‌లో మీడియాతో శనివారం మాట్లాడారు. ఆదివారం నుంచి మనందరికీ అందుబాటులో విజయనగరంలో ప్రారంభంకానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.