News March 22, 2025
వనపర్తి: పెబ్బేర్‌లో యాక్సిడెంట్.. రేషన్ డీలర్ మృతి

రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతిచెందిన ఘటన పెబ్బేర్ పరిధి అంబేడ్కర్ నగర్ రోడ్డు దగ్గర శుక్రవారం జరిగింది. SI హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలు.. చెలిమిళ్లకు చెందిన రేషన్ డీలర్ హనుమంతు కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వనపర్తి నుంచి పెబ్బేర్‌కు చేరుకుని బస్సు దిగే క్రమంలో కిందపడి మృతిచెందాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News September 14, 2025
KNR: సహకార సంఘాలకు పర్సన్ ఇన్ చార్జీల నియామకం

KNR జిల్లాలోని 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 సంఘాలకు గాను, 27 సంఘాలకు పాత PIC లనే కొనసాగిస్తూ, ఊటూర్, ఆర్నకొండ, గట్టుదుద్దెనపల్లి సంఘాల పదవీకాలాన్ని తిరిగి పొడిగించకుండా, వారిస్థానంలో సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్ చార్జీలను నియమించారు.
News September 14, 2025
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి: విజయ్

ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని సినీ హీరో, TVK చీఫ్ విజయ్ అన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి, ఎలక్షన్స్ పెట్టాలని BJP చూస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని మండిపడ్డారు. 500కుపైగా హామీలు ఇచ్చిన DMK ఎన్ని నెరవేర్చిందని ప్రశ్నించారు. కానీ CM స్టాలిన్ సిగ్గులేకుండా అన్నీ నెరవేర్చామని చెప్పుకుంటున్నారని అరియలూర్ రోడ్ షోలో ఫైరయ్యారు.
News September 14, 2025
GDK: లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం: జడ్జి

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందుతారని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని స్థానిక జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ లలో రాజీ కుదుర్చుకుంటే ఒకరు గెలిచి, మరొకరు ఓడినట్లు కాదన్నారు. రాజీ పడిన వివిధ కేసులను ఆయన కొట్టివేశారు.