News March 22, 2025
నారాయణపేట జిల్లాలో దారుణం.. భర్తను చంపిన భార్య

భూ వివాదం కారణంగా భర్తను భార్య చంపేసిన ఘటన నర్వలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లంకల గ్రామానికి చెందిన పాలెం అంజన్న(41) NRPT జిల్లాలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్య కొంత భూమిని అమ్మగా, మిగిలిన భూమి తన పేరుపై చేయలేదని కోపంతో భర్త మెడకు తాడు బిగించి చంపింది. రంగమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి అక్క పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI కురుమయ్య తెలిపారు.
Similar News
News March 22, 2025
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని కలెక్టర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్‌లో సౌకర్యాలను కల్పించింది.
News March 22, 2025
చర్లపల్లి జైలులో ఖైదీలకు అవగాహన

ఖైదీలకు న్యాయసహాయంపై శనివారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ బాల భాస్కరరావు, సెక్రటరీ జస్టిస్ కిరణ్‌కుమార్‌లు హాజరై ఖైదీలకు న్యాయసహాయం అవగాహన కల్పించారు. న్యాయ సహాయం కావాలంటే న్యాయసేవాధికార సంస్ధను సంప్రదించాలని సూచించారు.
News March 22, 2025
వరంగల్: గిరిజన యువకులకు మెగా జాబ్ మేళా

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం (ఉమ్మడి వరంగల్) పరిధిలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ఉదయం 10 గంటల నుంచి హనుమకొండ గిరిజన భవన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి సుచిత్ర మిశ్రా తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కాగలరని తెలిపారు.