News March 22, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ.1.20 లక్షల ఫైన్

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట సీఐ YRK శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. శుక్రవారం జగ్గంపేట ఎస్సై రఘునాథరావు, గండేపల్లి ఎస్సై శివ నాగబాబు చేపట్టిన ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 17 మంది పట్టుపడ్డారు. వీరిని కోర్టులో హాజరు పరచగా 12 మందికి రూ.10 వేల చొప్పున ఫైన్ విధించినట్లు సీఐ తెలిపారు.
Similar News
News March 22, 2025
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని కలెక్టర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్‌లో సౌకర్యాలను కల్పించింది.
News March 22, 2025
చర్లపల్లి జైలులో ఖైదీలకు అవగాహన

ఖైదీలకు న్యాయసహాయంపై శనివారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ బాల భాస్కరరావు, సెక్రటరీ జస్టిస్ కిరణ్‌కుమార్‌లు హాజరై ఖైదీలకు న్యాయసహాయం అవగాహన కల్పించారు. న్యాయ సహాయం కావాలంటే న్యాయసేవాధికార సంస్ధను సంప్రదించాలని సూచించారు.
News March 22, 2025
వరంగల్: గిరిజన యువకులకు మెగా జాబ్ మేళా

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం (ఉమ్మడి వరంగల్) పరిధిలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ఉదయం 10 గంటల నుంచి హనుమకొండ గిరిజన భవన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి సుచిత్ర మిశ్రా తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కాగలరని తెలిపారు.