News March 22, 2025
MBNR: పాలమూరులో ఇక క్రికెట్ పండుగ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటిసారిగా SGF ఆధ్వర్యంలో “జాతీయ స్థాయి బాలుర అండర్-19 క్రికెట్ టోర్నీ” ఏప్రిల్ 26 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోర్నీలో ఒక్కో రాష్ట్రం నుంచి 16 మంది క్రీడాకారులు, ఒక కోచ్, ఒక మేనేజర్ పాల్గొననున్నారు. దీంతో పాలమూరులో నూతన ఉత్సాహం నెలకొననుంది.
Similar News
News March 26, 2025
IPL: లక్నోకు గుడ్ న్యూస్!

లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్. రెండో మ్యాచులో ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ ఆ జట్టుతో చేరనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఎల్లుండి SRHతో జరిగే మ్యాచులో ఆడతారని పేర్కొన్నాయి. అవేశ్ ఫిట్‌గా ఉన్నట్లు క్లియరెన్స్ వచ్చిందని వెల్లడించాయి. మోకాలి గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచులో ఆడలేదు.
News March 26, 2025
నేటి ముఖ్యాంశాలు

* వచ్చే నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: చంద్రబాబు
* ఏప్రిల్ 1 నుంచి ఏపీలో ‘సదరమ్’ స్లాట్లు
* జగన్ ఇమేజ్ తగ్గించేందుకు కుట్ర: పేర్ని
* TG: 50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు: కూనంనేని
* రైతు భరోసా డబ్బులు విడుదల
* IPL: GTపై పంజాబ్ విజయం
News March 26, 2025
కామారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి’

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.