News March 22, 2025

అనకాపల్లి జిల్లాలో వడగాల్పులు

image

జిల్లాలో పలు చోట్ల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని APSDMA తెలిపింది. జిల్లాలో శుక్రవారం నాతవరంలో 40.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. శనివారం జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల దెబ్బకు వడదెబ్బలు తగిలే అవకాశం ఉందని తెలిపింది. అటు వైద్య శాఖ సైతం పలు సూచనలు చేసింది.

Similar News

News March 22, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ

image

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని కలెక్టర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్‌లో సౌకర్యాలను కల్పించింది.

News March 22, 2025

చర్లపల్లి జైలులో ఖైదీలకు అవగాహన

image

ఖైదీలకు న్యాయసహాయంపై శనివారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ జస్టిస్‌ బాల భాస్కరరావు, సెక్రటరీ జస్టిస్‌ కిరణ్‌కుమార్‌లు హాజరై ఖైదీలకు న్యాయసహాయం అవగాహన కల్పించారు. న్యాయ సహాయం కావాలంటే న్యాయసేవాధికార సంస్ధను సంప్రదించాలని సూచించారు.

News March 22, 2025

వరంగల్: గిరిజన యువకులకు మెగా జాబ్ మేళా

image

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం (ఉమ్మడి వరంగల్) పరిధిలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ఉదయం 10 గంటల నుంచి హనుమకొండ గిరిజన భవన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి సుచిత్ర మిశ్రా తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కాగలరని తెలిపారు.

error: Content is protected !!