News March 22, 2025

ప్రొద్దుటూరు: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే జిల్లా బహిష్కరణ

image

నేటి నుంచి జరగనున్న IPL క్రికెట్ సందర్భంగా బెట్టింగ్ అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఎస్పీ భావన పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక నిఘా ఉందని, గతంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన వారిని ఇప్పటికే గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. పదే పదే బెట్టింగ్ నిర్వహిస్తే జిల్లా బహిష్కరణ ఉంటుందన్నారు.

Similar News

News April 10, 2025

జమ్మలమడుగు: అది ప్రమాదం కాదు.. హత్యే.!

image

జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డులో మార్చి 24న ప్రమాదంలో గుడెంచెరువుకు చెందిన కిశోర్ బాబు మృతిచెందాడు. ఈ యాక్సిడెంట్‌ను పక్కా ప్లాన్‌తో ఉదయ్ కుమార్ చేశాడని CI లింగప్ప బుధవారం తెలిపారు. మార్చి 20న కిశోర్ బాబు మేనమామ కిరణ్ తల్లి దినం కార్యక్రమంలో ఉదయ్ కుమార్ భార్యను కిశోర్ కొట్టాడని వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని పక్కాప్లాన్‌తో యాక్సిడెంట్ చేశాడని CI తెలిపారు.

News April 9, 2025

ఒంటిమిట్ట కళ్యాణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

image

11వ తేదీన జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం వేడుకకు సంబంధించి పటిష్టమైన ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచించారు.

News April 9, 2025

చివరికి న్యాయమే గెలిచింది: మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా

image

చివరికి న్యాయమే గెలిచిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. తన సోదరుడు అంజద్ బాషా కడపలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా అంజాద్ అంజద్ బాషా మాట్లాడారు. చివరి వరకు న్యాయస్థానాన్ని నమ్మామన్నారు. న్యాయమే గెలిచి నా సోదరుడు అహ్మద్ అంజద్ బాషాకి బెయిల్ వచ్చిందన్నారు. కష్టకాలంలో తోడున్న వైసీపీ కార్యకర్తలకి, ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

error: Content is protected !!