News March 22, 2025
NTR: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. NTR(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.
Similar News
News November 5, 2025
జగిత్యాల: కిటకిటలాడుతున్న ఆలయాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు అర్చకులకు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీప దానాలు చేశారు.
News November 5, 2025
భీమదేవరపల్లి: NSS వాలంటీర్ల శ్రమదానం

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఏ.కె.వి.ఆర్. కళాశాల NSS వాలంటీర్లు బుధవారం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ ఆవరణలో పరిశుభ్రత పనులు చేపట్టారు. అలాగే, ముస్తాపూర్, చంటయ్యపల్లి గ్రామాలకు వెళ్లే బాటల మరమ్మతులు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ భూపతి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 150 మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
News November 5, 2025
ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


